అటు మిసైళ్లతో దాడులు.. ఇటు కొందరిలో అనుమానాలు.. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ నే అనుమానించగా.. నిన్న పొద్దున పదిన్నరకు ముగ్గురు అధికారులు మైక్ అందుకున్నారు. అందులో ఇద్దరు మహిళలు కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, మరొకరు IFS విక్రమ్ మిస్రీ… ఈ ముగ్గురూ ముగ్గురే.
విక్రమ్ మిస్రీ..: శ్రీనగర్ కు చెందిన ఈయన కశ్మీరీ పండిట్. 1989 బ్యాచ్ ఆఫీసర్ మిస్రీ.. దేశ 35వ విదేశాంగ కార్యదర్శి. ముగ్గురు ప్రధానులు గుజ్రాల్, మన్మోహన్, మోదీకి PSగా… డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా… చైనా, మయన్మార్ రాయబారిగా పనిచేశారు.
కర్నల్ సోఫియా ఖురేషి..: తాత, తండ్రిని చూసి సైన్యంలో చేరాలనే కల ఏర్పడింది. 1999లో మిలిటరీలో చేరి సిగ్నల్ కార్ప్స్ టీంను నడిపిన మొదటి మహిళగా నిలిచారు. జపాన్, చైనా, రష్యా, అమెరికా సహా ఎన్నో దేశాలు పాల్గొన్న ఎక్సర్ సైజ్ ఫోర్స్-18లో విన్యాసాలు చేసిన తొలి మహిళామె.
వ్యోమికా సింగ్..: యుద్ధ హెలికాప్టర్లు నడపటంలో సిద్ధహస్తురాలు. బాల్యం నుంచి పైలట్ కావాలని కల. 2,500 గంటలపాటు చేతక్, చీతా వంటి యుద్ధ విమానాలు నడిపిన అనుభవం. పర్వతాలు, సముద్ర తీరాల్లోని భిన్న వాతావరణాల్లో పనిచేయగా, ఎన్నో రెస్క్యూ మిషన్స్ కు నాయకత్వం వహించారు. కశ్మీర్, అరుణాచల్ రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితుల్లో సేవలందించారు.