ఆపరేషన్ సిందూర్-2.0లో భాగంగా పాకిస్థాన్ నగరాలపై భారత్ విరుచుకుపడింది. ఆ దేశం ప్రయోగించిన మిసైళ్లను భారత్ నిర్వీర్యం చేసింది. ఇందుకు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయిన యాంటీ బాలిస్టిక్ మిసైల్ ను వాడింది. 360 డిగ్రీల్లో ప్రత్యర్థి మిసైళ్లను కూల్చే S-400 రష్యాలో తయారవగా.. ఏకకాలంలో 36 లక్ష్యాల్ని ఛేదిస్తుంది. 2007లో తయారైన దీన్ని సిరియా, ఉక్రెయిన్ యుద్ధాల్లో వాడారు. 40 నుంచి 400 కి.మీ. వరకు దూసుకెళ్లగల S-400ను మన దేశం వివిధ సెక్టార్లలో రెడీగా ఉంచింది. 2022లో సిక్కిం, కశ్మీర్ సెక్టార్లో, 2023 నుంచి రాజస్థాన్, గుజరాత్ సెక్టార్లలో మోహరించారు. S-300 అనేది రష్యాకు చెందిన పాత తరం(Old Generation) గగనతల రక్షణ వ్యవస్థ కాగా.. దీనికి లేటెస్ట్ వెర్షనే S-400 సిస్టమ్. 2018 అక్టోబరులో భారత్ లో పర్యటించిన పుతిన్.. ఈ వ్యవస్థను మనకు అందించారు. ఎంతదూరంలో ఉన్నా ట్రాక్ చేసి కూల్చివేసే వ్యవస్థ దీని సొంతం.