ఎవరు చేసిన కర్మ వారనుభవించక తప్పదంటారు. అదిప్పుడు పాక్ విషయంలో రుజువైంది. ఇన్నాళ్లూ ఉగ్రవాదంతో భారత్(India)ను దొంగదెబ్బ(Cheating) కొట్టిన ఆ దేశం.. ఇప్పుడు చావుదెబ్బ తింటోంది. ఐరాస మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్ని దాచిపెట్టుకున్న పాక్.. భారత్ దాడి చేసిన సందర్భంలోనూ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ ను తన కంట్రోల్ లో ఉంచుకుంది. కశ్మీర్ లో నెత్తుటేరులు పారిస్తూ రక్తపిపాసిగా మారిన పాపం.. పహల్గామ్ దాడితో పండింది.
భారత్ పై అది ఎక్కుపెడతాం, అణుబాంబు వేస్తామంటూ బీరాలు పలికిన కుత్సిత దేశం.. డిఫెన్స్ వ్యవస్థను సైతం కాపాడుకోలేకపోయింది. ఆయుధాలు ఉండటం కాదు, అవి సరిగా ఉన్నాయో, లేదో చూసుకోవడం ముఖ్యం. ఉగ్రసంస్థల బాంబుదాడుల్ని నమ్ముకోవడం తప్ప తాము ఎంతలా భ్రష్టుపట్టిపోయామో తెలుసుకోలేదు. పిచ్చిపిచ్చి ప్రేలాపనలతో యుద్ధం చేస్తామంటే చివరకు ఏం జరుగుతుందో ఆ దేశానికి ఈరోజే అర్థమైంది.. ఇంకా అర్థమవ్వాల్సి ఉంది.