ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్న ‘ఆపరేషన్ సిందూర్’.. భారతీయుల శక్తి, సామర్థ్యాలకు నిదర్శనంగా నిలిచింది. ఇలాంటి అపురూప ఘట్టానికి వేదికగా నిలిచేలా అప్పుడే పుట్టిన చిన్నారులకు ‘సిందూర్’ పేర్లు పెట్టారు. బిహార్(Bihar)లోని ముజఫర్ పూర్(Muzaffarpur) చిన్నపిల్లల ఆస్పత్రిలో 12 మంది నవజాత శిశువులకు ఈ పేర్లు పెట్టారు. మగ పిల్లలకు ‘సిందూర్’, అమ్మాయిలకు ‘సిందూరి’ అని నామకరణం చేశారు. ఇది దేశానికి తామిచ్చే గౌరవమంటూ కతిహార్(Katihar)కు చెందిన సంతోశ్ కుమార్-రాఖీ కుమారి దంపతులు ఆనందంతో చెప్పారు. తన కొడుకు జువెల్లరీ దుకాణం నడుపుతున్నాడని, పుట్టిన మనవడు పెద్దయ్యాక సైన్యంలో చేరుస్తామంటూ సీతామర్హికి చెందిన బెల్సంద్-వందన దేవి దంపతులు అన్నారు.