పాకిస్థాన్ రక్షణ వ్యవస్థ(Defence)పై దెబ్బకొట్టిన భారత్.. నిన్న రాత్రి కరాచీ పోర్టుపై విరుచుకుపడింది. జమ్ముకశ్మీర్ సహా ఉత్తరాది రాష్ట్రాలపై డ్రోన్లు, మిసైళ్లు వేసిన ప్రత్యర్థికి గట్టి జవాబిచ్చింది. ఆ దేశంలోని 7 ప్రధాన నగరాలపై గురిపెట్టి కీలకమైన కరాచీ పోర్టును ధ్వంసం చేసింది. అరేబియా(Arabia) సముద్రం నుంచే భారత్ వచ్చిన ముష్కరులు.. ముంబయి దాడులకు పాల్పడ్డారు. ఇప్పుడు అరేబియా మీదుగా అస్త్రాలు ఎక్కుపెట్టింది భారత సైన్యం. పాక్ ప్రయోగిస్తున్న మిసైళ్లను కూల్చివేస్తోంది మన సేన. పాక్ జీవనాడి అయిన కరాచీ పోర్టు ద్వారా 70% ఎగుమతులు, దిగుమతులవుతాయి. ప్రైవేటు కంపెనీల భారీ పెట్టుబడులతో ఈ నగరం పరిశ్రమల పరంగా ఎదిగింది. అక్కడి GDPలో 20%నికి పైగా కరాచీ పోర్ట్ నుంచే వస్తోంది. దీన్ని మూసేస్తే పాక్ కు తీవ్ర నష్టం. దేశ దళాలకు ఆయుధాల సప్లై, ఆహారధాన్యాలు, ఔషధాలు సహా సరుకులన్నీ కరాచీ నుంచే వస్తుంటాయి.