జమ్ముకశ్మీర్, పంజాబ్ పై డ్రోన్ల దాడులకు పాల్పడుతూనే ఉంది పాకిస్థాన్. నియంత్రణ రేఖ(LoC) వెంబడి యురీ సెక్టార్లో బాంబు దాడులు చేస్తోంది. తమ రాష్ట్రంలో బాంబుల శబ్దాలు వినిపిస్తున్నాయని, ప్రజలు బయటకు రావొద్దంటూ జమ్ముకశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లా కోరారు. ఇప్పటికే వందలాది పాక్ డ్రోన్లను కూల్చేసిన సైన్యం.. ఎక్కడికక్కడ శత్రువును నిరోధిస్తోంది. జమ్ము, సాంబ, పఠాన్ కోట్, ఫిరోజ్ పూర్, జైసల్మేర్(రాజస్థాన్)లో బాంబు పేలుళ్లు జరిగాయి. దీంతో ఉత్తరాది రాష్ట్రాల్లో కరెంటు ఆపేసి ‘బ్లాక్ అవుట్’ పాటిస్తున్నారు. ఈరోజు సాయంత్రం నుంచి మిసైళ్లను ప్రయోగించగా, వాటిని ఆర్మీ కూల్చేసింది.