పాక్ కే కాదు ఆ దేశ క్రికెట్ కూ ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL)ను తమ దేశంలో నిర్వహిస్తామన్న వినతిని UAE తిరస్కరించింది. UAEని అడగకముందే నిర్ణయాన్ని ప్రకటించిన పాక్ కు పెద్ద షాక్ తగిలింది. BCCIతో ఎమిరేట్స్ కు సత్సంబంధాలున్నాయి. 2021 ICC టీ20 వరల్డ్ కప్, IPL ఎడిషన్ సహా.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాక్ లో జరిగినా భారత్ మ్యాచ్ లు దుబాయిలో జరిగాయి. ICCకి హెడ్ క్వార్టర్ దుబాయి కాగా.. దాని చీఫ్ జైషా. అయితే ఉన్నట్టుండి పాక్ మ్యాచ్ లు నిర్వహిస్తే భద్రతా సమస్యలు రావొచ్చని UAE భావించింది. పైపెచ్చు భవిష్యత్తులో భారత్ తోనూ ఇబ్బందులూ తలెత్తే ఆస్కారముంది. కాబట్టి వచ్చిందిలేదు, పోయిందీలేదన్న కోణంలో.. లేనిపోని తలనొప్పి ఎందుకున్న ఆలోచనలో పాక్ వినతిని రిజెక్ట్ చేసింది.