వరుసగా దాడులకు దిగుతున్న శత్రువుకు గట్టి బుద్ధిచెప్పింది భారత సైన్యం. ఆ దేశంలోని 4 ఎయిర్ బేస్ ల్ని నేలమట్టం చేసింది వాయుసేన. శ్రీనగర్ పై డ్రోన్లకు జవాబుగా రావల్పిండిలోని నూర్ ఖాన్(Nur Khan), చక్వాల్ లోని మురిద్, ఝంగ్ జిల్లా రఫిఖీ, సియాల్ కోట్ బేస్ ల్ని ధ్వంసం చేసింది. నిన్న సర్గోధా, ఫైసలాబాద్ బేస్ లు ధ్వంసం కాగా.. ప్రధానమైనవన్నీ తుక్కుతుక్కయ్యాయి. గతంలో చక్లాలా పేరున్న నూర్ ఖాన్ బేస్.. పాక్ కు అత్యంత ప్రధానమైంది. చైనా JF-17, ఫ్రెంచ్ మిరేజ్-5, ఫైటర్ జెట్లు, అలోటే-III హెలికాప్టర్లకు లాజిస్టిక్ & రీఫ్యూయలింగ్ ఇక్కడే ఉంటుంది. ఇస్లామాబాద్ కు 10 కి.మీ. దూరంలో ఉన్న దీని ద్వారానే మేజర్ కార్యకలాపాలుంటాయి. ఇక ఏరియల్ వెహికిల్స్ ను వాడే మురీద్ నుంచే సర్వైలెన్స్ మిషన్లు పనిచేస్తాయి.