భారత్-పాక్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఇరుదేశాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. కాల్పుల విరమణ(Ceasefire)కు రెండు దేశాలు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కాల్పుల విరమణను విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అధికారికంగా తెలియజేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. భారత్-పాక్ కు చెందిన డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ చర్చలు జరిపారని మిస్రీ తెలియజేశారు. అయితే ఇది శాశ్వత విరమణ కాదని, కేవలం తాత్కాలికమేనని భారత్ అంటోంది. ఇక నుంచి భారత్ పై జరిగే ఏ ఉగ్రవాద దాడినైనా యుద్ధంగానే పరిగణిస్తామని మోదీ సర్కారు స్పష్టం చేసిన కొద్ది గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.