‘ఆపరేషన్ సిందూర్’పై అనుమానాలు నెలకొన్న వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)ను అప్పగించడం, ఉగ్రవాదుల్ని భారత్ కు అందజేయడమన్నదే ప్రధాన లక్ష్యమని, ఇది తప్ప వేరే అంశంపై చర్చలు అవసరం లేదన్నారు. పాకిస్థాన్ కాల్పులు జరిపితే భారత్ ప్రతిదాడి తప్పదంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ కు కరాఖండీగా చెప్పారు. మోదీకి వాన్స్ ఫోన్ చేయగా.. భద్రతపై ఎట్టిపరిస్థితుల్లో రాజీపడేది లేదన్నారు. పాకిస్థాన్ దూకుడుగా వ్యవహరిస్తే జవాబు చెప్పాలని రక్షణ దళాలకు ఆదేశాలిచ్చారు.