‘ఆపరేషన్ సిందూర్’ కోసం ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నామని సైన్యాధికారులు(Chiefs) ప్రకటించారు. సరిహద్దు(Border) అవతల ఉన్న లక్ష్యాలను పూర్తిగా గుర్తించాకే వాటిని ధ్వంసం చేయగలిగామన్నారు. 140 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టామని, ఇది ఇంతటితో ఆగదని శత్రువుకు వార్నింగ్ ఇచ్చారు. సైన్యానికి పూర్తి అధికారాలు కల్పిస్తూ అంతకుముందే ప్రధాని ఆదేశాలిచ్చారు. అనంతరం నలుగురు ఉన్నతాధికారులు మీడియా సమావేశంలో మాట్లాడారు. పాకిస్థాన్ వాయు, నావికా దళాల్ని మట్టుబెట్టామని, రాడార్ స్టేషన్లు తుక్కుతుక్కయ్యాయని గుర్తు చేశారు.