పాకిస్థాన్ కు చెందిన ఎయిర్ బేస్ లు ధ్వంసం కావడంలో బ్రహ్మోస్( BrahMos) సూపర్ సోనిక్ క్షిపణి వాడారు. శత్రు దేశం బాలిస్టిక్ మిసైల్ వాడటంతోనే భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై UP సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టతనిచ్చారు. ”ఆపరేషన్ సిందూర్’లో బ్రహ్మోస్ పవర్ అంటే ఏంటో తెలిసింది.. ఎవరికైనా ఇది అర్థం కాకపోతే పాకిస్థాన్ ను అడగండి.. ఉగ్రవాదంపై కుక్కతోక లాంటిది పాకిస్థాన్.. దాని సొంత భాషలోనే జవాబిస్తేనే దారికొస్తుంది..’ అని అన్నారు. బ్రహ్మోస్ ప్రాజెక్టుకు గాను ఉత్తరప్రదేశ్ లో 200 ఎకరాలు కేటాయిస్తున్నామన్నారు. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ యూనిట్ ను యోగితో కలిసి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు.