దేశమంతా తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్న భారత్-పాక్ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్(DGMO) చర్చలు వాయిదా పడ్డాయి. ముందటి షెడ్యూల్ ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సి ఉండగా, సాయంత్రానికి వాయిదా పడింది. ఈ నెల 10న ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ(Ceasefire) ఒప్పందం జరగ్గా.. నేటి చర్చల కోసం ఉత్కంఠ ఏర్పడింది. ప్రత్యర్థి రెచ్చగొడుతున్నా సహనం పాటిస్తున్న భారత్.. మళ్లీ యుద్ధం చేస్తుందా లేదా అన్నది ఈ చర్చల ద్వారా తేలిపోనుంది. అయితే రక్షణ శాఖకు చెందిన ఉన్నతాధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్(PoK)లో చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ అయిందంటూ పాక్ లో జరిపిన దాడుల తీరును వీడియో ప్రజెంటేషన్లో వివరించారు.