సాయంత్రం ఇరుదేశాల DGMOల చర్చలు…
రాత్రికి ప్రధాని మోదీ ప్రసంగం…
ఈ రెండే నేడు హాట్ టాపిక్ అంశాలు. మిలిటరీ DGల చర్చల్ని బట్టే మోదీ ప్రసంగం ఉండే అవకాశం ఉందా అన్నది తేలాల్సి ఉంది. అంటే రేపట్నుంచి ఏం జరగనుందో ఈ రెండు అంశాలే ప్రభావితం చేయనున్నాయి. భారత్-పాక్ తీవ్ర ఉద్రిక్తతల టైంలో, అనూహ్యంగా కాల్పుల విరమణ జరిగింది. అయితే అందివచ్చిన అవకాశాన్ని వదులుకున్నామంటూ మెజార్టీ భారతీయులు నిట్టూర్పు విడిచారు. ఈ నెల 10 నుంచి ఈ 3 రోజుల్లో జరిగిన పరిణామాలు.. ప్రత్యర్థి కవ్వింపులు.. తమదే విజయమంటూ రెచ్చగొడుతున్న పాక్ ఇలా.. మోదీ ప్రసంగం తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’పై క్లారిటీ వచ్చే అవకాశముంది. ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలు ఈపాటికే కేంద్ర పెద్దలకు చేరడంతో.. మరి ఏ నిర్ణయం తీసుకుంటారన్నది సస్పెన్స్. https://justpostnews.com