‘ఆపరేషన్ సిందూర్’పై ప్రపంచ యుద్ధ నిపుణుడు జాన్ స్పెన్సర్.. భారతదేశాన్ని ఆకాశానికెత్తారు. 4 రోజుల సైనిక చర్యపై అంచనా రూపొందించిన ఆయన.. భారత్ భారీ విజయాన్ని సాధించిందన్నారు. ఇంకా ఏమన్నారంటే…
‘ఆపరేషన్ సిందూర్ వ్యూహాత్మక లక్ష్యాల్ని చేరుకుంది.. ఉగ్రవాద శిబిరాల నాశనంతో సైనిక ఆధిపత్య ప్రదర్శన, కొత్త జాతీయ భద్రతా సిద్ధాంత ఆవిష్కరణ ఏర్పడ్డాయి.. ఇది ప్రతీకాత్మక శక్తి కాదు, నిర్ణయాత్మక శక్తి.. భారత్ ఇక రియాక్టివ్ దౌత్యంతో సంతృప్తి చెందట్లేదు.. అది బలంగా నాటుకుపోయిన శక్తి.. అణు బెదిరింపులకు ఏ మాత్రం వెరవని ధీశాలి..’ అంటూ రాసుకొచ్చారు. ప్రపంచ యుద్ధ రీతుల్ని అధ్యయనం చేయడంలో ఆరితేరిన అమెరికా వార్ ఫేర్ నిపుణుడు జాన్ స్పెన్సర్.. 4 రోజుల్లోనే ‘ఆపరేషన్ సిందూర్’ సక్సెస్ కావడాన్ని కొనియాడారు.