పాక్ కు మద్దతిచ్చిన తుర్కియే(Turkey) ప్రస్తుతం గిలగిలా కొట్టుకుంటోంది. మన ప్రధాన విమానాశ్రయాల్లో సేవలందిస్తున్న ఆ దేశ సంస్థ సెలెబి(Celebi)పై కేంద్రం వేటు వేసింది. అదాని సైతం గట్టి దెబ్బకొడుతూ కంపెనీతో భాగస్వామ్యం రద్దు చేసుకున్నారు. సెలెబితో కలిసి అదాని ఎయిర్ పోర్ట్ హోల్డింగ్స్.. ముంబయి, అహ్మదాబాద్ సహా 9 విమానాశ్రయాల్ని చూస్తోంది. సెక్యూరిటీ క్లియరెన్స్ ను బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ రద్దు చేయడంతో.. ఆ కంపెనీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశంలో ఐదు కంపెనీలు కలిగిన సెలెబి సంస్థ షేర్లు 20% నష్టపోయాయి. ఈ తుర్కియే సంస్థ 15 ఏళ్లుగా భారత్ లో ఉంది.