‘ఆపరేషన్ సిందూర్’ కంటిన్యూ అవుతుందని విదేశాంగ మంత్రి(External Affairs) సుబ్రమణ్యం జైశంకర్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 22 నాటి పహల్గామ్ తరహా దాడి జరిగితే ఇక యుద్ధమేనన్నారు. ‘టెర్రరిస్టులు పాకిస్థాన్ లో దాక్కున్నా సరే.. ఆ దేశంలో ఎక్కడున్నా ఏరిపారేస్తాం.. నేనీ విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నా.. ఆపరేషన్ సిందూర్ నడుస్తూనే ఉంటుంది..’ అని డచ్ పబ్లిక్ బ్రాడ్ కాస్టర్ అయిన NOSకు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వార్నింగ్ ఇచ్చారు.