పోక్సో కేసుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ వినూత్న తీర్పు కేసు వివరాలు చూస్తే…
24 ఏళ్ల వ్యక్తి మైనర్ బాలికతో లైంగిక సంబంధం నడిపి దోషిగా తేలాడు. ఆమె మేజర్ అయ్యాక పెళ్లి చేసుకోగా, ఇప్పుడు బిడ్డతో కలిసి ఉంటున్నారు. ఈ ఘటన చట్టప్రకారం నేరమే. కానీ కలకత్తా హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ 20 ఏళ్ల శిక్షను 2023లో రద్దు చేసింది. దీన్ని పక్కనపెట్టిన సుప్రీం.. శిక్షను తిరిగి అమలు చేసింది. వెంటనే శిక్షించకుండా నిపుణులతో కమిటీ వేసింది. ‘ఆమె విషయంలో సమాజం తీర్పుచెప్పింది.. న్యాయవ్యవస్థ విఫలమైంది.. సొంత కుటుంబం ఆమెను విడిచిపెట్టింది..’ అని జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ బెంచ్ వ్యాఖ్యానించింది. నిందితుడితో అనుబంధం, ప్రస్తుత కుటుంబ జీవనంపై నిపుణుల కమిటీ రిపోర్టు పరిశీలించి.. శిక్షను రద్దు చేసింది. ఆమెకు ఆర్థికసాయంతోపాటు పదో తరగతి పూర్తి చేశాక పార్ట్ టైం ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.