KCRకు కవిత ఉత్తరం(Letter) రాయడంపై ఆమె సోదరుడు KTR స్పందించారు. ‘కేసీఆర్ కు ఉత్తరాలు రాసిన వారు చాలా మంది ఉన్నారు.. ప్రజాస్వామిక పార్టీ కాబట్టి పార్టీ అధ్యక్షుడికి ఎవరైనా లెటర్ రాయవచ్చు.. పార్టీ చీఫ్ కు సూచనలు చేయాలంటే ఎవరైనా ఆ పని చేయవచ్చు.. అయితే మనం ఎవరమైనా సరే.. అంతర్గత విషయాలు అంతర్గతంగానే మాట్లాడితే బాగుంటది.. పార్టీలో ఏ హోదాలో ఉన్నా అందరికీ ఇదే సూత్రం వర్తిస్తది.. కొన్ని విషయాలు లోలోపలే మాట్లాడాల్సి ఉంటది.. అన్ని పార్టీల్లోనూ కోవర్టులుంటారు.. మా పార్టీలోనూ రేవంత్ కోవర్టులు ఉండొచ్చు..’ అని స్పష్టం చేశారు.