తెలంగాణలో నిర్వహిస్తున్న ‘మిస్ వరల్డ్’ పోటీల్లో సంచలనం చోటుచేసుకుంది. ఇంగ్లండ్ అందగత్తె మిల్లా మాగీ(Milla Magee).. ఉన్నట్టుండి పోటీల నుంచి తప్పుకున్నారు. 24 ఏళ్ల మాగీ గతేడాది మిస్ ఇంగ్లండ్ కిరీటం గెలిచి తాజా పోటీలకు వచ్చారు. ప్రదర్శన ఇచ్చే కోతుల్లా చూస్తున్నారని ఆరోపించారు. పూర్తిగా పాత ధోరణితోనే పోటీ ఉందని, తమను వింతగా చూస్తుండటంపై షాక్ తిన్నానన్నారు. పురుష స్పాన్సర్ల ముందు మేకప్, గౌన్లతో పొద్దున్నుంచి రాత్రి వరకు ఉండాల్సి వచ్చిందన్నారు. మాగీ వ్యక్తిగత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అక్కడి అధికారి అన్నారు. ఆమె తప్పుకోవడంతో మాగీ స్థానంలో 25 ఏళ్ల షార్లెట్ గ్రాంట్.. ఫైనల్లో పాల్గొంటున్నారు.