ఫేస్ బుక్ లో వచ్చిన పోస్ట్.. రాష్ట్రీయ జనతాదళ్(RJD) నేత, లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ జీవితాన్ని మార్చింది. ఒక మహిళతో ఫొటో, 12 ఏళ్లుగా రిలేషన్లో ఉన్నామన్న పోస్ట్ వైరల్ అయింది. అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో.. తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయిందని తేజ్ ప్రతాప్ వివరణిచ్చారు. తనను వేధించడానికే ఇలా చేశారన్నారు. అయితే కుటుంబ విలువలు మంటగలిపారంటూ తండ్రి లాలూ ఆయన్ను.. పార్టీతోపాటు కుటుంబం నుంచి బహిష్కరించారు. బిహార్ మాజీ CM దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్యతో వివాహమైనా కొన్ని నెలల్లోనే విడిపోయారు. ఈ కేసు కోర్టులో ఉంది.