తిరుమల(Thirumala) శ్రీవారి చెంతన మరో రికార్డు నమోదైంది. క్యూలైన్ల నిర్వహణలో సరికొత్త విధానంతో గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా దర్శనాల సంఖ్య 90 వేలు దాటింది. శని, ఆదివారాల్లో భక్తులు(Pilgrims) భారీగా తరలివచ్చారు. వేసవి సెలవులకు తోడు వారాంతం కావడంతో అన్ని కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లు చేరుకున్నాయి. శనివారం నాడు 90,211 మంది దర్శనం చేసుకోగా, ఆదివారం సైతం ఆ సంఖ్య 90 వేలు దాటింది. ఈ రెండ్రోజుల్లో శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పట్టింది. శుక్రవారం నాడు 74,374 మంది రాగా.. మరుసటి రోజే మరో 16 వేల మందికి పైగా కొండపైకి విచ్చేశారు.