సింగిల్ స్క్రీన్ థియేటర్లు(Theatres) ప్రశ్నార్థకమైన వేళ.. జూన్ 1 నుంచి బంద్ చేస్తామని పిలుపివ్వడంతో రగడ మొదలైంది. తెలంగాణ, APలో లీజుకు నడుస్తుండగా, ఎక్కువగా ప్రముఖ నిర్మాతలవనే ప్రచారముంది. అద్దె(Rental Basis) లెక్కన షోలు వేయలేమని, మల్టీప్లెక్సుల్లా పర్సంటేజ్ ఇవ్వాలన్నది ఎగ్జిబిటర్ల డిమాండ్. నైజాంలోని 370 హాళ్లలో తనకు 30, ఏషియన్-సునీల్-సురేశ్ సంస్థకు 90 ఉండగా, మిగతా 250 థియేటర్లు ఓనర్లవేనని FDC ఛైర్మన్ దిల్ రాజు తెలిపారు. తూ.గో. జిల్లాలో ఎక్కువ హాళ్లుంటే అందులో మాజీ MLA ద్వారంపూడి చంద్రశేఖర్ వే ఎక్కువ కావడంతో బంద్ అంశం అక్కణ్నుంచే మొదలైందనే ఆరోపణలున్నాయి. పవన్ హరిహర వీరమల్లు రిలీజ్ టైంలోనే వివాదం చేస్తున్నారంటూ రగడ నడుస్తోంది. ఈ గొడవ APలో రాజకీయ రంగు పులుముకొంది. అయితే ఎగ్జిబిటర్ల కోరికలో న్యాయం ఉందని, బంద్ కాకుండా సమస్య పరిష్కరించుకోవాలని దిల్ రాజు సూచించారు.