బిహార్ మాజీ CM లాలూ ప్రసాద్ యాదవ్ పై ఆయన మాజీ కోడలు ఐశ్వర్యరాయ్ తీవ్రంగా విమర్శించారు. తేజ్ ప్రతాప్ కు ఇంకో ఎఫైర్ ఉందని తెలిసీ పెళ్లి చేసి తన జీవితాన్ని నాశనం చేశారన్నారు. 12 ఏళ్లుగా ఓ మహిళతో రిలేషన్ షిప్ లో ఉన్నానంటూ తేజ్ ప్రతాప్ ఫేస్ బుక్ అకౌంట్లో ఫొటో, పోస్ట్ వచ్చింది. ఇది ఫేక్ అని వివరణిచ్చినా అప్పటికే వైరలైంది. అన్ని వైపులా విమర్శలు రావడంతో తేజ్ ప్రతాప్ ను RJDతోపాటు కుటుంబం నుంచి బహిష్కరించారు. కానీ ఇదంతా పెద్ద డ్రామా అని, రాబోయే బిహార్ ఎలక్షన్ల కోసం ఆడుతున్న నాటకమంటూ ఐశ్వర్య మౌనాన్ని వీడారు.