ఆసియా మార్కెట్ల పతనంతో భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో మొదలయ్యాయి. IT, ఆటో, ఆర్థిక సేవలు, ఫార్మా రంగాల్లో విక్రయాల వల్ల ఒడిదొడుకులు ఏర్పడ్డాయి. రెండ్రోజుల పాటు లాభాల్లో నడిచిన మార్కెట్లు.. ఆర్థిక వ్యవస్థ స్థితిపై ప్రకటన రానుండటంతో మదుపర్ల(Investors)లో భయాలు ఏర్పడి నష్టాలకు దారితీశాయి. 855 పాయింట్లు దిగజారిన సెన్సెక్స్(Sensex) 81,400 పాయింట్ల వద్ద.. నిఫ్టీ 246 పాయింట్లు కోల్పోయి 24,754 వద్ద ట్రేడయ్యాయి.