జమ్ముకశ్మీర్(Jammu Kashmir) సర్కారు సంచలన నిర్ణయాన్ని అమలు చేసింది. కేబినెట్ సమావేశాన్ని.. వేసవి, శీతాకాల రాజధానులు శ్రీనగర్, జమ్ముకు బదులుగా ‘పహల్గామ్’లో నిర్వహించింది. ‘పహల్గామ్’ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంతో కశ్మీర్ టూరిజం పడిపోయింది. దీంతో పర్యాటకుల్ని ఆకర్షించేందుకు CM ఒమర్ అబ్దుల్లా.. దాడి జరిగిన చోటే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఉమ్మడి JKకు 2009-2014 కాలంలో తొలిసారి CMగా ఉన్న ఒమర్.. గురెజ్, మాచిల్, తాంగ్ధర్, రాజౌరి, పూంఛ్ వంటి భయంకర మారుమూల ప్రాంతాల్లో కేబినెట్ భేటీలు నిర్వహించారు. కేంద్రం కూడా ‘పహల్గామ్’లో పార్లమెంటరీ కమిటీల సమావేశాలు జరపాలని ఒమర్ అబ్దుల్లా ప్రధానిని కోరారు.