ఆకాశ్, S-400 విలువేంటో మొన్నటి పాక్ తో యుద్ధంలో తెలిసింది. కానీ అంతకన్నా పవర్ ఫుల్ అస్త్రం భారత్ అమ్ములపొదిలో చేరనుంది. అడ్వాన్సుడ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్(AMCA)కు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ఐదో తరం(5th Generation) ప్రొటో టైప్ ఫైటర్ జెట్లు.. ఎయిర్ డిఫెన్స్ లపై సులువుగా, కచ్చితత్వంతో దాడి చేస్తాయి. ఆత్మనిర్భర్ లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో 2035 కల్లా అందుబాటులోకి తేవడానికి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ రెడీగా ఉంది. తొలిదశ తయారీకి రూ.15 వేల కోట్లు వెచ్చిస్తోంది. ఇప్పటికే తేజస్ విమానాలు దూసుకుపోతుంటే వాటికి అడ్వాన్సుడ్ గా AMCA జెట్లు తయారు కానున్నాయి. సెన్సార్ సిస్టమ్, అంతర్గత ఆయుధాలు, మోడ్రన్ ఏవియానిక్స్, సూపర్ క్రూయిజ్ వంటి ఫీచర్లు ఈ ఫైటర్లలో ఉంటాయి. DRDO నేతృత్వంలో వీటి తయారీ జరగనుంది.