తెలంగాణ హైకోర్టు(High Court)కు ముగ్గురు కొత్త జడ్జిలు రాబోతున్నారు. ఇందులో కర్ణాటక నుంచి ఇద్దరు, పట్నా నుంచి ఒకరు ఉన్నారు. దేశవ్యాప్తంగా 11 హైకోర్టులకు చెందిన 21 మంది న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్.. కలకత్తాకు వెళ్లనున్నారు. కర్ణాటక నుంచి జస్టిస్ సి.సుమలత, జస్టిస్ లలిత కన్నెగంటి.. పట్నా నుంచి జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్ రెడ్డి రాష్ట్రానికి రాబోతున్నారు. మద్రాసు నుంచి జస్టిస్ బట్టు దేవానంద్.. APకి రానున్నారు. అలహాబాద్ నుంచి నలుగురు, కర్ణాటక, గువాహటి నుంచి ముగ్గురేసి చొప్పున బదిలీ అవుతున్నారు. కొలీజియం ప్రతిపాదనలకు ఆమోదం లభించగానే బదిలీలు జరుగుతాయి.