వాతావరణ శాఖ(IMD) అంచనా వేసినట్లుగానే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ(Heavy) వర్షాలు పడుతున్నాయి. కరీంనగర్ జిల్లా ఖాసింపేటలో రాష్ట్రంలోనే అత్యధికంగా 11.4 సెం.మీ. నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాంపల్లిలో 10.5, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిర్మలాపూర్‌లో 10.1 సెం.మీ. వాన కురిసింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో రేపు అత్యంత భారీ వర్షాలు ఉన్నందున ఇప్పటికే IMD.. ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించింది. https://justpostnews.com