ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ(BSNL).. మూణ్నెల్ల కాలానికే భారీగా లాభాలు ఆర్జించింది. 17 ఏళ్లలో లేని విధంగా 2025 జనవరి-మార్చి త్రైమాసికాని(Quarter)కి రూ.280 కోట్లు సంపాదించింది. ఈ విషయాన్ని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్ చేశారు. గతేడాది ఇదే కాలంలో రూ.849 కోట్లు నష్టపోయింది. 2024లో రూ.5,370 కోట్లుగా ఉన్న నష్టాలు ప్రస్తుతం రూ.2,247 కోట్లకు తగ్గాయి. క్రమశిక్షణ, నియంత్రణ, 4G/5G విస్తరణతో మిగతా టెలికాం సంస్థలకు పోటీదారుగా BSNL తయారైంది. https://justpostnews.com