పవర్ హిట్టింగ్, చురుకైన కీపింగ్ చేసే పంత్… ఈ IPL(2025) సీజన్లో దారుణంగా ఫెయిలయ్యాడు. కానీ చివరి మ్యాచ్ లో రెచ్చిపోయి(118 నాటౌట్; 61 బంతుల్లో 11×4, 8×6) భారాన్ని దించుకున్నాడు. మొత్తం 14కు గాను 11వ మ్యాచ్ ఆడుతున్న పంత్.. గత పదింట్లో 135 పరుగులే చేశాడు. ఏప్రిల్ 14న చెన్నైపై 63 స్కోరే హయ్యెస్ట్. అతడికి అత్యధికంగా రూ.27 కోట్లు వెచ్చించింది సూపర్ జెయింట్స్(LSG). IPLలోనే అత్యంత ఖరీదైన శ్రేయస్(రూ.26.75 కోట్లు)ను పంత్ దాటేశాడు. అతడి కెప్టెన్సీలో LSG.. 13 మ్యాచుల్లో 7 ఓడి, 6 గెలిచి 12 పాయింట్లతో ఇంటిముఖం పట్టింది. ఇందులో గెలిచినా ఫలితం శూన్యం. ప్రతిదానికీ చిరాకు పడే జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా.. రిషభ్ ఫెయిల్యూర్ పై ఏమంటారో చూడాలి. https://justpostnews.com