ఎలాన్ మస్క్ కు చెందిన ‘స్టార్ లింక్(Starlink)’కు కేంద్రం అనుమతిచ్చింది. ఉపగ్రహ కమ్యూనికేషన్ సర్వీసులకు లైసెన్స్ దక్కడంతో ఇక శాట్ కామ్ కమర్షియల్ సేవలు దేశంలో మొదలవుతాయి. టెలికామ్ నుంచి లైసెన్స్ పొందిన మూడో కంపెనీ స్టార్ లింక్ కాగా.. రిలయన్స్ జియో, యూటెల్ సాట్స్ వన్ వెబ్(OneWeb) మిగతా రెండు సంస్థలు. ట్రంప్ బెదిరింపులతో ఇప్పటికే 22 బిలియన్ డాలర్లు(రూ.2 లక్షల కోట్లు) నష్టపోయిన ఎలాన్ మస్క్ కు ఇది భారీ ఊరట. దక్షిణాసియా దేశాల్లో అడుగు పెట్టేందుకు నిరీక్షిస్తున్న ఆయనకు.. ఈ నిర్ణయం గొప్ప ముందడుగు. భారత్ కోసం 2022 నుంచి మస్క్ ఎదురుచూస్తున్నారు. https://justpostnews.com