ఎయిరిండియా డ్రీమ్ లైనర్(Dreamliner) ఫ్లైట్లు ఎగరడం కష్టంగా మారింది. అహ్మదాబాద్ క్రాష్ తర్వాత అన్నింట్లో సమస్యలు బయటపడ్డాయి. అందుకే ఈరోజు విదేశాలకు వెళ్లే ఆరింటిని రద్దు చేశారు. ఢిల్లీ-దుబాయ్, ఢిల్లీ-వియన్నా, ఢిల్లీ-పారిస్, అహ్మదాబాద్-లండన్, బెంగళూరు-లండన్, లండన్-అమృత్ సర్ ట్రిప్పులు రద్దయ్యాయి. హాంకాంగ్-ఢిల్లీ విమానంలో సమస్య తలెత్తడంతో తిరిగి హాంకాంగ్ వెళ్లిపోయింది. నిన్న శాన్ ఫ్రాన్సిస్కో-ముంబయి ఫ్లైట్ లోనూ టెక్నికల్ ఇష్యూతో ప్రయాణికుల్ని కోల్ కతాలో దించేశారు. లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్ వేస్ సంస్థలు నడుపుతున్న రెండు డ్రీమ్ లైనర్లలోనూ సమస్యలు రావడంతో వాటిని తిప్పిపంపారు.