CCTV ఫుటేజ్ లు, వెబ్ కాస్ట్ లనేవి అంతర్గత పర్యవేక్షణ యంత్రాలని.. ఎన్నికల ప్రక్రియలో చట్టబద్ధ తప్పనిసరి అంశాలు కావని EC వివరించింది. తారుమారు, తప్పుడు సమాచారం వంటి ఎన్నికల పిటిషన్లకు వీలుగానే 45 రోజులు భద్రపరుస్తామని, ఈ లోపు ఎలాంటి పిటిషన్ దాఖలు కాకపోతే డేటాను తొలగించడమేనంది. కోర్టు అడిగితేనే ఫుటేజ్ ను కాలానికి మించి భద్రపరుస్తామని చెప్పింది. నిర్దేశిత వ్యవధి లోపు ఎలాంటి పిటిషన్ దాఖలు కాకపోతే వీడియో డేటా, CCTV ఫుటేజ్, వెబ్ కాస్ట్స్, సంబంధిత రికార్డులను నాశనం చేయాలని రాష్ట్రాల అధికారుల్ని ఆదేశించింది. 1961 ఎన్నికల నిర్వహణ నియమావళిలోని కోడ్ 93ను EC సిఫార్సు మేరకు కేంద్ర న్యాయశాఖ 2023 డిసెంబరులో సవరించింది. ఓటర్ల భద్రతపై ఎప్పుడూ రాజీ పడలేదు, ఎప్పటికీ పడబోము అంటూ EC కరాఖండీగా తెలియజేసింది.