కుల ధ్రువీకరణ పత్రాల(Caste Certificates)కు ఇంకా పాత పద్ధతులేనా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విడాకులు తీసుకున్న స్త్రీ.. పిల్లల సర్టిఫికెట్ల కోసం భర్తను సంప్రదించాల్సిందేనా అని అడిగింది. ఒంటరి తల్లుల పిల్లలకు సర్టిఫికెట్ల జారీలో గైడ్ లైన్స్ మార్చాలన్న పిటిషన్ పై వాదనలు జరిగాయి. తండ్రి వైపు(తాత, తండ్రి, మామ) నుంచి పట్టుబట్టకుండా OBC స్థితి ఆధారంగా ఇవ్వాలని పిటిషనర్ కోరారు. పితృవంశపారంపర్యత లెక్కనే ఇవ్వాలని ప్రస్తుత రూల్స్ చెబుతున్నాయి. దీనిపై వివరణివ్వాలని జస్టిస్ కె.వి.విశ్వనాథన్, జస్టిస్ ఎన్.కె.సింగ్ బెంచ్ కేంద్రాన్ని ఆదేశించింది. https://justpostnews.com
వారి కష్టాలు గమనించి సూచనలు చేయవచ్చని స్పష్టం చేసింది. అయితే పిటిషనర్ కు అనుకూలంగానే కేంద్రం అఫిడవిట్ వేస్తూ.. ఇది రాష్ట్రాల పరిధిలోనూ ఉన్నందున వాటి స్పందన అవసరమని తెలిపింది. దీనిపై జవాబివ్వాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోర్టు ఆదేశించింది. అటు కులాంతర వివాహాలపైనా క్లారిటీ ఇవ్వాలంటూ తుది విచారణను జులై 22కు వాయిదా వేసింది.