రాష్ట్రంలో అతిపెద్ద విషాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని మందుల(Medicine) పరిశ్రమలో భారీ పేలుడుతో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. తొలుత 8 మంది మృతిచెందారని భావించినా తర్వాత మరో 29 మంది మృత్యువాత పడ్డారు. 700 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతతో కూడిన లుడుతో కొంతమంది సజీవ దహనమయ్యారు. కొన్ని మృతదేహాలు 50 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. గుజరాత్ కు చెందిన సిగాచీ సంస్థకు తెలంగాణ, మహారాష్ట్రల్లోనూ పరిశ్రమలున్నాయి. ముడి సరకును తెచ్చి ఈ కంపెనీలో శుద్ధి చేసి మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనే ఔషధాన్ని తయారు చేస్తారు. మృతుల్లో ఒడిశా, బిహార్, జార్ఖండ్, తమిళనాడుకు చెందినవారున్నారు. CM రేవంత్ ఘటనాస్థలికి వెళ్తున్నారు.