దశాబ్దకాలం(Decade) తర్వాత సుదీర్ఘ పర్యటన కోసం మోదీ బయల్దేరారు. మొత్తం 8 రోజుల పాటు 5 దేశాలు చుట్టివస్తారు. ఘనా, ట్రినిడాడ్&టొబాగో, అర్జెంటినా, బ్రెజిల్, నమీబియా అధినేతలతో భేటీలు ఉంటాయి. రక్షణ, వాణిజ్యంతోపాటు బ్రెజిల్ లో జరిగే బ్రిక్స్(BRICS-బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) సదస్సులో పాల్గొంటారు. 2015లో 8 రోజులు 6 దేశాల్లో పర్యటించిన మోదీ.. పదేళ్లకు మళ్లీ సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారు. 2-3 తేదీల్లో ఘనా.. 3-4న ట్రినిడాడ్&టొబాగో.. 4-5 తేదీల్లో అర్జెంటీనా.. 5-8 తేదీల్లో బ్రెజిల్.. 8-9న నమీబియాలో పర్యటిస్తారు. 2010లో 5 దేశాలతో మొదలైన బ్రిక్స్.. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)ని భాగస్వాముల్ని చేసుకుంది. https://justpostnews.com