అహ్మదాబాద్ విమాన ప్రమాదం(Flight Crash)పై లోతైన దర్యాప్తు జరుగుతోంది. టేకాఫ్ అయిన వెంటనే పైలట్లు.. మే డే కాల్(ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పైలట్లు చేసే కాల్) చేసిన 15 సెకన్లలోనే ఫ్లైట్ కూలిందని భావిస్తున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB) ఆధ్వర్యంలో దర్యాప్తు నడుస్తోంది.
అసలు కారణాలివే’నా’…
@ టేకాఫ్ తర్వాత ఎత్తుకు చేరుకోవడానికి కష్టమైంది.
@ 2 ఇంజిన్లు ఒకేసారి శక్తిని కోల్పోయాయి.
@ ల్యాండింగ్ గేర్ అప్పటికే పాక్షికంగా ముందుకు వంగింది.
@ టైర్లను ఉపసంహరించేందుకు సిబ్బంది యత్నించారు.
@ విద్యుత్తు కోల్పోవడం లేదా హైడ్రాలిక్ వైఫల్యంతో ల్యాండింగ్ గేర్ డోర్స్ తెరచుకోలేదు..
@ విద్యుత్ వైఫల్యమైతే ఫ్లైట్ వెనుకన RAT అని పిలిచే అత్యవసర టర్బైన్ శక్తిని అందిస్తుంది. అది జరగలేదు.
@ ల్యాండింగ్ గేర్ మార్చడం, రెక్కల ఫ్లాప్ లను వెనక్కి తీసుకోవాలని యత్నించినా ఫలితం లేదు.