సంగారెడ్డి(Sangareddy) జిల్లా పాశమైలారంలోని కెమికల్ కంపెనీ ప్రమాదంలో 40 మంది ప్రాణాలు కోల్పోయారని సిగాచీ(Sigachi) కంపెనీ ప్రకటించింది. మరో 33 మంది గాయపడ్డారని, ఒక్కో మృతుడికి కోటి రూపాయల పరిహారం అందిస్తామని తెలిపింది. ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని, దీనిపై దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేసింది. కోటి పరిహారమిచ్చేలా చూడాలంటూ నిన్న CM ఆదేశించడంతో.. కంపెనీ యాజమాన్యం దిగివచ్చింది. మూడు నెలల పాటు కార్యకలాపాలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.