BJP జాతీయ అధ్యక్ష పీఠం కోసం మహిళలు ముందంజలో ఉన్నారు. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్, డి.పురందరేశ్వరి, వానతి శ్రీనివాసన్ పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థికమంత్రి నిర్మల.. తమిళనాడు వాసి. అక్కడ పార్టీ బలపడాలంటే ఆమెకు పీఠం కట్టబెట్టాలన్న భావన ఉంది. ఈ మధ్యే జె.పి.నడ్డా, బి.ఎల్.సంతోశ్ తో నిర్మల భేటీ అయ్యారు. AP మాజీ అధ్యక్షురాలు పురందరేశ్వరి.. UK, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీకి వెళ్లి ఆపరేషన్ సిందూర్ ను గట్టిగా వినిపించారు. https://justpostnews.com
BJP మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్.. 1993లో పార్టీలో చేరారు. 2021లో కోయంబత్తూరు నుంచి పోటీచేసి మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్ ను ఓడించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తేవడం విజయమైతే.. మహిళా ఓట్లను పెంచుకోవడమే లక్ష్యంగా అధ్యక్ష పదవికి ఆ వర్గం నేతనే ఎంచుకోవాలన్న ఆలోచన BJPలో కనపడుతోంది.