రాష్ట్ర పాలనను పర్యవేక్షించే ముఖ్యమంత్రి ఆయన. కానీ తన పొలం కోసం సొంతంగా వ్యవసాయం(Cultivation) చేసుకున్నారు. నగ్రా థెరాయ్ రీజియన్లోని ఖతిమా ప్రాంతంలో మడిలోకి దిగి నాట్లు వేశారు ఉత్తరాఖండ్ CM పుష్కర్ సింగ్ ధామి. దేశ సంస్కృతి, సంప్రదాయానికి వ్యవసాయం ప్రతీక అని నిరూపించేందుకే ఈ పని చేసినట్లు తెలిపారు. ఈ రంగంపై రైతుల్లో ఉత్సాహాన్ని తెచ్చేందుకు సొంతంగా నాట్లు వేశానన్నారు. కర్షకుల(Farmers) కృషి, అంకితభావం, త్యాగానికి సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. ఇలా నాట్లు వేయడం ద్వారా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.