ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో ఉన్నా, ఆయన ఎప్పుడు చర్చకు పిలిచినా రెడీ అని మాజీ మంత్రి KTR అన్నారు. సవాల్ కు రాకపోతే KCRకు క్షమాపణ చెప్పాలన్నారు. ఛాలెంజ్ లో భాగంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చిన ఆయన.. రేవంత్ పే సీఎం(Pay CM) అన్నారు. పదవి కాపాడుకునేందుకు ఢిల్లీకి మూటలు పంపే CM అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రాకున్నా ఆయన మంత్రులైనా చర్చకు వస్తారేమోనని ఎదురుచూసినా అది జరగలేదన్నారు.