గుండెపోటు, పక్షవాతంతో ఎనిమిదేళ్ల క్రితం తండ్రి మరణం.. జలుబు ఎంతకీ తగ్గక ఆస్పత్రికి వెళ్తుండగానే సోదరుడు మృతి.. ఆర్నెల్లలోనే ఇద్దర్ని కోల్పోతే.. ఇప్పుడు అక్కకు కేన్సర్. క్రికెట్ లేని రాష్ట్రంలో పుట్టి, ఆటను అసహ్యించే ప్రాంతంలో పెరిగిన ఆకాశ్ దీప్ గాథ ఇది. ఇంగ్లండ్ పై 10 వికెట్లు తీసి దేశాన్ని గెలిపించాడతడు. తండ్రి వద్దనడంతో చాటుగా క్రికెట్ నేర్చుకుని.. బిహార్లోని సస్రామ్ వదిలి బెంగాల్లోని దుర్గాపూర్ చేరాడు. తండ్రి, సోదరుడి మరణంతో మూడేళ్లు క్రికెట్ కు దూరమయ్యాడు. తర్వాత కోల్ కతా చేరి బెంగాల్ రంజీ సభ్యుడయ్యాడు. 2019 రంజీల్లో 35 వికెట్లు తీసి 2021 IPLలో RCB దృష్టిలో పడ్డాడు. https://justpostnews.com
తల్లి బాగోగులు, కేన్సర్ సోకిన సోదరికి సేవలు.. ఇలా జీవితమంతా విషాదంగా మారినా దేశానికి ఆడాలన్న కోరిక తగ్గలేదు. బెంగాల్లో షమీ పరిచయంతో ఆకాశ్ బౌలింగ్ స్టైలే మారింది. మైదానాల కంటే హాస్పిటల్స్ ఎక్కువగా తిరిగిన అతడు.. 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో స్టీవ్ స్మిత్ ప్రశంసలు అందుకున్నాడు. అప్పట్నుంచి సాదాసీదాగా ఉన్న అతడు ఇంగ్లండ్ ను వారి సొంత దేశంలో ఓడించి హీరో అయ్యాడు.