శాసనసభ ఎన్నికలకు ముందు బిహార్(Bihar) సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంది. అయోధ్య రామ మందిరం తరహాలో సీతాదేవి ఆలయం నిర్మించేందుకు రూ.882.78 కోట్లను కేబినెట్ మంజూరు చేసింది. సీతామర్హి జిల్లాలోని సీతమ్మ జన్మస్థలమైన పునౌరా ధామ్(Punaura Dham)లో గుడి కడతారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాదిరిగా పనులు చేపట్టేందుకు ప్రణాళిక తయారవుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు, అన్ని కేడర్లలో మహళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి అన్ని ప్రభుత్వ నియామకాల్లో స్థానిక మహిళలకు రిజర్వేషన్లు అందుతాయి. https://justpostnews.com