రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా రేపు(శనివారం) నాడు విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) హెచ్చరించడంతో.. సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి KCR ఆదేశాల మేరకు ఈ డిసిషన్ తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కంటిన్యూ వర్షాలు ఉంటున్నాయి. గురు, శుక్రవారాల్లో ఎడతెరిపిలేని వానలు పడటంతో ఆ రెండు రోజులను సెలవులుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఆకస్మిక నిర్ణయం తీసుకుంది.
ఈ రెయిన్స్ మరో రెండు రోజులైనా తగ్గే అవకాశం లేకపోవడంతో సెలవుల్ని మరో రోజుకు పొడిగించింది. ఎలాగూ ఆదివారం సెలవే కాబట్టి విద్యాసంస్థలకు వరుసగా నాలుగు రోజులు హాలిడేస్ వచ్చినట్లయింది.