విడుదలకు ముందే సంచలనంగా మారిన ‘ఉదయ్ పూర్ ఫైల్స్’ సినిమాలో 150 సీన్లకు కత్తెర పడింది. రాజస్థాన్ ఉదయపూర్ వాసి కన్హయ్య లాల్.. 2022 జూన్లో హత్యకు గురయ్యారు. ఇస్లాంకు వ్యతిరేకమైన పోస్టు పెట్టిన దర్జీ(Tailor) కన్హయ్యను.. ఆయన షాపులోనే ఇద్దరు అత్యంత కిరాతకంగా తల నరికి హత్య చేశారు. ఈ కేసు ఆధారంగా భరత్ శ్రీనాతె(Shrinate) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు అమిత్ జాని నిర్మాత. మత ఘర్షణల ప్రమాదమున్నందున ‘ఉదయ్ పూర్ ఫైల్స్’ రిలీజ్ పై స్టే ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలైంది. రెణ్నెల్లపాటు సెన్సార్ బోర్డుకు తిరిగానని, కానీ 150 సీన్లు కట్ చేశారని డైరెక్టర్ భరత్ తెలిపారు. ఈనెల 11న సినిమా విడుదల కావాల్సి ఉంది.