ఢిల్లీలో కొలువుదీరిన BJP సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. CM రేఖా గుప్తా అధికారిక బంగ్లాలో సౌకర్యాల కోసం వేసిన రూ.60 లక్షల టెండర్ ను రద్దు చేసింది. కోట్ల నిధులతో శీష్ మహల్ ను కేజ్రీవాల్ నిర్మించారంటూ ఎన్నికల్లో ప్రచారం చేసి BJP అధికారంలోకి వచ్చింది. అలాంటి తప్పు తాము చేయకూడదని భావించి టెండర్ ను రద్దు చేసింది. విద్యుత్తు, 14 ACలు, రూ.9 లక్షల విలువైన TVలు, రూ.6 లక్షల విలువ గల లైట్ ఫిటింగ్స్ కోసం ప్లాన్ రెడీ చేశారు. ఫిబ్రవరిలో అధికారంలోకి వచ్చిన ఆమె.. కేజ్రీవాల్ నివసించిన బంగ్లాను కాదని ఆ పక్కనే ఉన్న రాజ్ నివాస్ మార్గ్ లో ఉంటున్నారు.