భూప్రకంపనల(Tremors)తో ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోయాయి. దేశ రాజధాని(NCR) పరిధిలోని హరియాణా ఝజ్జర్(Jhajjar) జిల్లాలో 4.4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, మీరఠ్ వణికిపోగా.. జనం ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఝజ్జర్ కు 200 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉంది. భూకంప ప్రభావాన్ని బట్టి దేశాన్ని 4 జోన్లు(2, 3, 4, 5)గా విభజించారు. ‘హై రిస్క్ ఏరియా’గా జోన్-4లో ఢిల్లీ ఉంటే.. అక్కడ భూకంపాలు రావడం కామన్. భారత్ లో ఏ ప్రాంతాన్నీ జోన్-1గా చూపలేదు. హైదరాబాద్, విశాఖ.. జోన్-2లో ఉన్నాయి. https://justpostnews.com