43కు తొలి వికెట్.. 44కే రెండో వికెట్.. ఇలా ఇంగ్లండ్ ఓపెనర్లిద్దరినీ నితీశ్ కుమార్ రెడ్డి ఔట్ చేశాడు. అయినా ఆ జట్టు లార్డ్స్ లో జరుగుతున్న మూడో టెస్టులో మరో వికెట్ కోల్పోకుండా టీ టైమ్ కు 153/2తో ఉంది. క్రాలీ(18), డకెట్(23)ను వెంటవెంటనే నితీశ్ వెనక్కు పంపాడు. కానీ జో రూట్(54 బ్యాటింగ్), ఒలీ పోప్(44 బ్యాటింగ్) జోడీ సెంచరీ భాగస్వామ్యంతో ఇంగ్లండ్ కోలుకుంది.