స్థానిక సంస్థల ఎన్నికలు, BC రిజర్వేషన్లపై రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కులగణన సర్వేకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపింది. హైకోర్టు గడువు మేరకు BC రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో BCల 42% రిజర్వేషన్లకు అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపింది. ఇది పెండింగ్ లో ఉండగా, ఇక ఆర్డినెన్స్ ద్వారానే రిజర్వేషన్ల అమలుకు కేబినెట్ ఆమోదించింది. దీని అమలుకు గాను 2018లో తెచ్చిన చట్టానికి సవరణ చేయబోతున్నది. https://justpostnews.com